బీజేపీ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం.. తెగిపోయిన లిఫ్ట్ తీగలు

 


లిప్ట్ తీగలు తెగి పడిపోయిన ఘటనలో బీజేపీ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ నేతలు వచ్చారు. అనంతరం బీజేపీ కార్యలయంలో ఉన్న లక్ష్మణ్ ను కలిసి అనంతరం కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే నడ్డాతో పాటు ఎమ్మెల్యేలు, ఇంకా భద్రతా సిబ్బంది కూడా ఎక్కారు. దీంతో పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్ తీగలు తెగిపోయి.. అదుపుతప్పి గ్రౌండ్ ఫ్లోర్ కు జారింది. అయితే లిఫ్ట్ మెుదటి అంతస్తులో ఉంది కాబట్టి ప్రమాదం తప్పిందని.. అదే ఇంకా ఏ మూడో అంతస్తో, ఆ పైనుంచో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగుండేదని నేతలు అంటున్నారు. కాగా లిఫ్ట్ లో కేంద్రమంత్రి జేపీ నడ్డాతో పాటు ఎమ్మెల్యే ఎన్వీఎన్ఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu