వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు జీవితఖైదు...
posted on May 24, 2017 3:38PM

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెంగల వెంకట్రావుకు జైలు శిక్ష పడింది. 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపాలెం బీఎంసీ కంపెనీ (కెమికల్ ఫ్యాక్టరీ) ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళన నేపథ్యంలో మత్స్యకారుడు కోశాల కొండ మృతి అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి మృతికి చెంగల వెంకట్రావు, ఆయన అనుచరులే కారణమని కేసు దాఖలైంది. అప్పటినుండి ఈ కేసుపై విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత వెంకట్రావుకు అనకాపల్లి సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. ఆయనతో పాటు మరో 15 మందికి కూడా ఇదే శిక్షను విధించింది. మరో ఐదుగురికి రెండేళ్ల చొప్పున జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది.