రజనీ బీజేపీలో చేరతారా..?
posted on May 24, 2017 1:12PM
.jpg)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే తమిళనాట పెద్ద చర్చలే మొదలయ్యాయి. తన అభిమానులతో సమావేశమైన రజనీకాంత్.. తాను రాజకీయాల్లోకి వచ్చేది పరోక్షంగా చెప్పకనే చెప్పారు. దీంతో ఆయన త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అసలు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత రజనీ సొంత పార్టీ పెడతారా? లేక బీజేపీలో చేరుతారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే రజనీకి మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే దీనిపై బీజేపీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎల్ గణేశన్ స్పందిస్తూ.. రజనీకి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి.. కానీ అవి రాజకీయపరమైనవి కావు... ముందు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలో వద్దో తేల్చుకోనివ్వండి.. అని ఆయన వ్యాఖ్యానించారు. మరి రజనీ కొత్త పార్టీ పెడతారా..? లేక బీజేపీలో చేరుతారా..? అసలు పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే. మొత్తం మీద రజనీ తీసుకోబోయే నిర్ణయం, తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులకు దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.