ఒక్క రోజు ఛైర్మన్ ఛాన్స్.. 46 అంశాలకు ఆమెదం
posted on May 26, 2016 12:28PM
.jpg)
ఒక్క రోజు సీఎం.. ఒక్క రోజు కమిషనర్ తరహాలో ఒక్క రోజు ఛైర్మన్ ఛాన్స్ కెట్టేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 46 అంశాలకు ఆమెదం పలికి అందరిని ఆశ్యర్యపరిచాడు ఓ కౌన్సిల్. ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా.. వైకాపా కౌన్సిల్ బొద్దులూరు ధర్మయ్య. అసలు సంగతేంటంటే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది. అయితే శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో 35 కౌన్సిలర్లు ఉండగా.. వారిలో టీడీపీ నుండి 21 మంది, వైకాపా నుండి 11 మంది, బీజేపీ నుండి ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి టీడీపీ కౌన్సిలర్లలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. వైసీపీ నుండి 11 మందీ హాజరయ్యారు. ఇక బీజేపీ నుండి ఇద్దరు వచ్చారు. అయితే టీడీపీ కౌన్సిలర్లు ఒక్కరు కూడా రాకపోవడంతో సమావేశం నిర్వహించేందుకు మునిసిపల్ కమిషనర్ శ్రీరామశర్మ నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అసలు ఎందుకు సమావేశం ఏర్పాటుచేశారని వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరి పరిస్థితిని సమీక్షించారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో కమిషనర్ సభ జరిపేందుకు నిర్ణయించి.. ఆపై డెలిగేట్ చైర్మన్ గా ధర్మయ్యను ఎన్నుకున్నారు. దీంతో అజెండాలో ఉన్న 46 అంశాలకూ వైకాపా ఆమోదం పలకడం జరిగిపోయింది. ఈ తరహా ఘటన జరగడం శ్రీకాళహస్తి మునిసిపల్ చరిత్రలో తొలిసారని తెలుస్తోంది.