అనుష్క విషయంలో కోహ్లీ హర్ట్
posted on Apr 10, 2015 3:30PM

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక్క పరుగు తీసి ఔటయ్యాడు. తను సరిగా ఆడలేకపోవడం ఏమో కాని క్రికెట్ అభిమానులు మాత్రం పాపం అనుష్క శర్మ మీద తిట్ల వర్షం కురిపించారు. అనుష్క వల్లే కోహ్లీ తొందరగా ఔటయ్యాడంటూ దుమ్మెత్తి పోశారు. అయితే ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఈ విషయం మీద మొదటిసారి నోరు విప్పాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి- అనుష్క శర్మకి సంబంధం ఏమిటని అన్నాడు. ఒక్క మ్యాచ్ లో సరిగా ఆడకపోతే ఇన్ని నిందలు వేస్తారా అని ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో మా ఇద్దరి మీద వచ్చిన విమర్శలు చూసి షాకయ్యానన్నాడు. ఇండియా ఓడిపోవడానికి కారణం మేమిద్దరమే అనడం వల్ల నేను హర్ట్ అయ్యా అంటూ ట్వీట్ చేశాడు.