మరుగుతున్న సాంబార్

 

ఆంధ్రప్రదేశ్‌లో మర్డర్లు చేసయినా ఎర్రచందనం తరలించుకుని వెళ్ళిపోయే స్మగ్లర్ కూలీలు 20 మందిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీలు పడుతున్నాయి. స్మగ్లర్లు తిరువణ్ణామలై ప్రాంతానికి చెందినవారు కావడంతో అక్కడ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మృతుల బంధువులు కూలీల మృతదేహాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు చంద్రపటాలను దగ్ధం చేశారు. కొన్నిచోట్ల తెలుగువారికి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో తమిళనాడుకు బస్సులు నడపడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఏపీఎస్ ఆర్టీసీ గత నాలుగు రోజులుగా బస్సులు నిలిపివేసింది. ఈ వివాదంపై న్యాయ విచారణ జరిపించాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా వుంటే, ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 500 మంది కార్యకర్తలో చిత్తూరు కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరిన ఎండీఎంకే నేత వైగోను వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu