రూ.99కే స్మార్ట్‌ఫోన్..! ఆధార్ కార్డు ఉంటేనే ఫోన్
posted on May 18, 2016 3:32PM

మొన్నామధ్య రూ.251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటిస్తే..ఇప్పుడు ఏకంగా రూ.99కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నమోటెల్ అచ్చే దిన్ సంస్థ ప్రకటించింది. బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీఈవో మాధవరెడ్డి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. దీని అసలు ధర రూ.2,999గా ఉండగా దాన్ని రూ.99కే అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ అని సంస్థ వెల్లడించారు. మేకిన్ ఇండియా ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తయారు చేశామని చెప్పారు. నిన్నటి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని మాధవరెడ్డి చెప్పారు.
స్మార్ట్‌ఫోన్ కావలసిన వారు ఇలా చేయాలి:
* బి మై బ్యాంకర్.కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడీ, పాస్‌వర్డ్‌ను పొందాలి
* ఇందులో లాగిన్ అయ్యాక ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాలి.
* ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడీ అందుతుంది.
* దాని సాయంతో నమోటెల్.కామ్ వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోటో, ఆధార్‌కార్డ్ ఆప్‌లోడ్ చేస్తే బుకింగ్ కన్ఫామ్ అవుతుంది