ఢిల్లీలో కారులో యువతిపై గ్యాంగ్ రేప్
posted on Mar 11, 2013 10:48AM

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అరాచకాలు కొనసాగుతునె ఉన్నాయి. నిర్భయ అత్యాచారంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన ఢిల్లీలో మహిళల పై కీచక పర్వాలు ఆగడం లేదు. ఢిల్లీ లో మరో యువతి పై ప్రయాణిస్తున్న కారులో సామూహిక అత్యాచారానికి దుండగులు పాల్పడ్డారు. అఘాయిత్యం అనంతరం బాధితురాలి(34)ని ప్రగతి మైదాన్ సమీపంలో రహదారిపై పడేసి పోయారు. కారులో మొత్తం ఆరుగురుంటే. వారిలో ఇద్దరు మహిళలేనని పేర్కొన్నారు. పైగా వారంతా తనకు తెలిసిన వారేనని బాధితురాలు తెలిపారు.
బాధితురాలిని అక్షరధామ్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన కారులోని దుండగులు ఆమెను లోపలకు లాగేసి ఎక్కించుకున్నారు. అఘాయిత్యం తరువాత ఆమెను రోడ్డుపై పడేసిన దుండగులు.. రెండు మొబైల్ ఫోన్లను, కొన్ని నగలను కూడా దోచుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.