చలికాలంలో ఎందుకు వణుకుతాం ?

 

ఈ మధ్య కలాం లో తీవ్రమైన చలి పెరిగిపోయింది. దీనికారణంగా మనం భరించరాని చలిలో ఉన్నప్పుడు మన శరీరం వణుకు తుంది. దంతాలు కటకటా కొట్టుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది. 

*శరీరం వణకడం దంతాలు కొట్టుకోవటమూ మనశరీరం లో వేడి ఉత్పత్తి కావటానికి జరిగే చర్యలు. బయటి నుంచి వచ్చే చలిని తట్టుకోవడానికి వీలుగా శరీరంలో ఉష్టం ఉత్పత్తి కావాలి. మన దవడ కండరాలు శరీరంలోని మిగతా కండరాలు వణకడం ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తాయి. అలా పుట్టిన ఉష్ణం బయటి చలిని తట్టుకోడానికి ఉపకరిస్తుంది. 

*మరీ చల్లటి నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు కూడా మన కండరాలు ఇలాగే వణుకు తాయి గమనించండి. 

*ఇదే విధంగా మలేరియా మూత్రనాళఇన్ఫెక్షన్ కి సంబందించిన జ్వరం లాంటి కొన్ని జ్వరాలాలో కూడా మన శరీరపు టెంప రేచర్ బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. 

*ఇక్కడ కారణం కూడా ఇదే. 

*మన శరీరంలో వృద్ధి చెందుతున్న రోగ క్రిముల వ్యాప్తిని అరి కట్టడానికి శరీరానికి ఉష్ణం బాగా కావాల్సి ఉంటుంది. వనకటం ద్వారా మనం ఈ ఉష్ణాన్ని సంపాదించు కుంటాము.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu