జగన్ బాధిత పక్షాన కాకుండా నిందితుల పక్షానే ఎందుకుంటారో తెలుసా?

జగన్ నిందితుల పక్షానే ఎందుకుంటారన్న విషయంలో   సమాధానం వెతకాలంటే ఆయన తండ్రి, అంతకన్నా ముందు ఆయన తాత హయాం నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. రాజారెడ్డి కన్నా ముందు తరం అంటే రాజారెడ్డి   తండ్రి వెంకటరెడ్డి తరం గురించి ఒక మాట చెబుతారు. వీరు ఆనాడు భూముల కోసం ఆశ పడి సొంత ధర్మాన్ని ధిక్కరించి,  ఆపై క్రిష్టియానిటీ పుచ్చుకున్నారనీ.. ఆ తర్వాత వారు పులివెందులకు వచ్చారనీ.. అక్కడి నుంచి వీరు భూ స్వాములుగా మారారనీ అంటారు. ఆపై రాజారెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారనీ.. ఆపై మైనింగ్ యజమానులను బెదిరించి మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు.

ఇక్కడ ఎటు నుంచి ఎటు చూసినా.. జగన్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ ఎక్కడైందంటే.. రాజారెడ్డి తన కొడుకు రాజశేఖర్ రెడ్డిని ఎంబీబీఎస్ చేయించడంతో మొదలైంది. దానికి తోడు ఆయన రూపాయ డాక్టర్ కావడంతో.. మొదలైంది అసలు రాజకీయం. అప్పటి వరకూ రాజారెడ్డి అంటే రక్తసిక్త రాజకీయమే గుర్తుకొచ్చేది. అలా అలా తమకున్న రక్తపు మరకలు కడుగుతూ వచ్చిన వైయస్ ఫ్యామిలీ తర్వాతి కాలంలో మహానేత అంటూ కొత్త కలరింగులు ఇచ్చుకోవడం మొదలైంది.

 అయితే జగన్ తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని  పాటిస్తూ వచ్చారు. అందుకే ఆయన తన పార్టీలో కూడా అలాంటి వారినే ప్రొత్సహిస్తారు. న్యూడ్ విడియోతో రచ్చకెక్కిన ఎంపీ గోరంట్ల మాధవ్, డెడ్ బాడీని డోర్  డెలివరీ  చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, రాసలీలల అంబటి, అవంతి.. ఆపై అవినీతికే దగ్గరుండి ఓనమాలు దిద్దించిన రోజా, రజని. ఇక లిక్కర్ కింగ్స్ చెవిరెడ్డి, మిధున్ రెడ్డి.. క్వార్ట్జ్ కా రాజా కాకాణి, సోదరినే విచక్షణ మరచి మరీ బూతులు తిట్టిన ప్రసన్న కుమార్ రెడ్డి. అలాగే బెట్టింగ్ రాజా అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు ఒక అంతంటూ ఉండదు. 

ఆయన పార్టీలోని పై  స్థాయి వారే ఇలాగుంటే ఇక తెనాలి గంజాయ్ బ్యాచ్, ఆపై పల్నాడు బెట్టింగ్ రాజులకే విగ్రహాల నిర్మాణం ఇలా ఎటు నుంచి ఎటు చూసినా నెగిటివ్ కేరెక్టర్లే ఎక్కువ కనిపిస్తాయి. అందుకేగా ఆయన పబ్లిక్ గా అంటోంది 'పిలకాయలన్నాక కొట్టుకోరా!' అని. ఆపై  రప్ప రప్ప అంటే తప్పు లేదని అనడం కూడా ఇందులో భాగమేనంటారు. మచ్చుకైనా సరే గుడ్ ఉండదు.. అంతా బ్లడ్డే అన్నది పరిశీలకుల విశ్లేషణ. అసలాయన అడుగు పెడితే తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే ఆ జగనన్న రథ చక్రాల కింద కసకస నలగాల్సిందేనంటారు. ఇందుకు జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కారు కింద నలిగి మరణించిన సింగయ్య ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu