మద్యం కుంభకోణం సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాల్లోకి.. లోకేష్
posted on Aug 1, 2025 7:00AM
.webp)
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంలో పెద్దారెడ్డి పెద్ద లబ్ధిదారుగా లోకేష్ ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలున్నాయని అన్నారు. సింగపూర్ పర్యటన వివరాలను, రాష్ట్రానికి రానున్న పెట్టుబడులను వివరించేందుకు గురువారం (జులై 31)న లోకేష్ మీడియా సమావేశంలో మాట్టాడారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి వైసీపీయులు ఇప్పటికీ నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
తాము పెట్టుబడుల కోసం సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఏపీ నుంచి సింగపూర్ సర్కార్ కు ఓ మెయిల్ వచ్చిందనీ, ఆ మెయిల్ లో త్వరలో ఏపీలో ప్రభుత్వం మారుతుందనీ, అందుకే ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావద్దనీ ఉందన్నారు. ఇంతకీ ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందని ఆరాతీస్తే అది పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పని చేసే వ్యక్తిగా తేలిందని లోకేష్ తెలిపారు. పెద్దిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్న లోకేష్.. మద్యం కుంభకోణానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు.
జగన్ హయాంలో ఓ డిస్టిలరీ నాలుగు వందల కేజీల బంగారం కొనుగోలు చేసిందన్నారు. మద్యాన్ని బంగారంతో తయారు చేయరు కదా.. మరి ఆ బంగారం ఎక్కడకు చేరిందో బయటకు రావాలని, వస్తుందని చెప్పారు. పక్కా ఆధారాలతోనే మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందన్న లోకేష్.. జగన్ హయాంలో మద్యం సరఫరా చేసిన ఓ డిస్టిలరీ కంపెనీలు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసిందనీ.. మద్యం సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాలకే మళ్లిందని ఆరోపించారు. మద్యం కుంభకోణం సొమ్మ తన ఖాతాలలోకి మళ్లలేదని పెద్దిరెడ్డి చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో లోకేష్ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.