క్యాస్టింగ్ కౌచ్ వివాదం.. చిరంజీవి పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు
on Jan 27, 2026

-సింగర్ చిన్మయి సంచలన ట్వీట్
-క్యాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి కాన్ఫిడెన్స్ ఏంటి!
-ఎవరు చెప్పేది నిజం
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)..గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి(Chinmayi)..ఈ ఇద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ ఉన్నా కూడా తెలుగు సినీ పరిశ్రమకి దొరికిన లెజండ్రిస్ అని చెప్పవచ్చు. చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)విజయం ఇచ్చిన జోష్ లో ఉన్నారు. ఆ జోష్ ని ఇచ్చిన అభిమానులకి, ప్రేక్షకులకి, పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు చెప్తూ రీసెంట్ గా సక్సెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. సదరు మీట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలపై గాయని చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు సినీ సర్కిల్స్ తో పాటు ఇద్దరి అభిమానుల్లో వైరల్ గా మారింది. మరి చిరంజీవి ఏం మాట్లాడాడు, చిన్మయి ట్వీట్ ఆంతర్యం ఏంటో చూద్దాం.
తన కూతురు, అశ్వనీ దత్ కూతుర్లు మాదిరిగానే మరింత మంది ఆడబిడ్డలు సినీ రంగంలో తమకి ఇష్టమైన దాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంలో చిరంజీవి మాట్లాడుతు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉండదు. అదంతా అబద్దం. నువ్వు స్ట్రాంగ్ గా, స్ట్రిక్ గా ఉంటే నిన్ను ఎవరు ఏమి చెయ్యలేరు. నీకుండే బిహేవియర్, అభద్రతా భావం బట్టి క్యాస్టింగ్ కౌచ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఏమో క్యాస్టింగ్ కౌచ్ కి లోబడి మనం ఉండాలేమో అని అనుకోకూడదు. నువ్వు ప్రొఫిషినల్ గా ఉంటే ఎదుటివాళ్ళు కూడా ప్రొఫిషినల్ గా ఉంటారు. ఇండస్ట్రీ అద్దం లాంటింది. నువ్వు ఏది ఇస్తావో తిరిగి అదే ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి రావాలి. హార్డ్ వర్క్ తో పని చేసి ఉన్నత శిఖరాలని అధిరోహించవచ్చని చిరంజీవి మాట్లాడటం జరిగింది.
ఈ వ్యాఖ్యలపై చిన్మయి స్పందిస్తు క్యాస్టింగ్ కౌచ్ అదుపులో లేని సమస్య. కమిట్ మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరు. చిరంజీవి గారు ఒక లెజండ్. ఆయన తొలి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులని గౌరవించే వాళ్ళు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు.ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు. లిరిసిస్ట్ వైరముత్తు లైంగికంగా నన్ను వేధించాడు. ఆ విధంగా నన్ను వేధించమని నేను అడగలేదు. పైగా నా తల్లి ముందే అదంతా జరిగింది ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా ఖచ్చితంగా శారీరక సుఖాన్ని కోరుకుంటారని ట్వీట్ చెయ్యడం జరిగింది. ఈ విధంగా చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో పాటు ముందు ముందు ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



