మిథున్ రెడ్డి అరెస్టులో జనం గొంతు ఎక్కడుంది జగన్?
posted on Jul 21, 2025 12:37PM
.webp)
క్విడ్ ప్రో కోలాంటి కొత్త కొత్త విధానాలతో స్కాములు చేసిన జగనేంటి? ఇంత అడ్డంగా బుక్ అయిపోయారు? ఆయనకు స్కాములు చేయడం కూడా చేత కావడం లేదా? అన్నదిప్పుడు కొత్తగా మొదలైన చర్చ. ఆ పార్టీ మాజీ ఎంపీ భరత్ జగన్ కి మందుబాబుల కష్టాలు తెలీవు. దీంతో తాము దారుణంగా దెబ్బ తిన్నామంటున్నారు.
నిజానికి నాణ్యమైన మద్యం ఎందుకంటే, అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. నాటు సారా ఎందుకు బ్యాన్ చేశారు? అది కూడా ఒక రకమైన మందే. కానీ కొన్ని ప్రామాణికాలను పాటించడం వారి వల్ల కాదు. అదే మెక్ డెవలస్, కింగ్ ఫిషర్, బడ్ వైజర్ వంటి కంపెనీలు.. ఈ ప్రామాణికాలు పాటించడం అందరికీ తెలిసిందే. వీటి రెప్యుటేషన్ ఈనాటిది కాదు. అలాంటి కంపెనీలను పక్కన పెట్టి.. దారిన బోయే దానయ్యలకు టికెట్లు ఇచ్చినంత ఈజీగా ఈ లోకల్ సరుకు జనం నెత్తికేసి రుద్దడం అన్నది జగన్ చేసిన అతి పెద్ద తప్పిదం. బైక్ తోలేస్తున్నాం కదాని విమానం నడపటం సాధ్యం కాదు కదా? ఇదీ అంతేనంటారు
ఒక సామాన్యుడికి పార్టీ టికెట్ ఇవ్వడం మంచి విషయం అయ్యింది కదాని.. ఒక లోకల్ కంపెనీకి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేలాంటి చర్యలు చేపట్టడం తప్పు గా చెబుతారు వీరంతా. ఈ విషయంలో జగన్ కి పెద్దగా అనుభవం లేదని చెప్పాలంటారు నిపుణులు. అందుకే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్.. మిథున్ రెడ్డి అరెస్టుతో కల్తీ మద్యం తాగిన వారి ఆత్మలు శాంతిస్తాయని అన్నారని చెబుతారు. జగన్ కి మంచి చెడుల విశ్లేషణ అస్సులు తెలీదని అంటారు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం ఎలా పని చేస్తుంది? ఇక అసలు మేటర్లోకి వస్తే.. ఈయనకసలు స్కాములు చేయడం కూడా చేతకావడం లేదన్న మాట వినిపిస్తోంది. ఒక్క రిమాండ్ రిపోర్ట్ లో సిట్ ఇన్నేసి తప్పిదాలను బయట పడేస్తుంటే ఇంకా జగనన్న బుకాయింపులేంటో అర్ధం కావడం లేదంటున్నారు కొందరు. అదేమంటే మిథున్ జగన్ కి ఫ్రెండ్ కాబట్టి కక్ష సాధించారని పెద్దిరెడ్డి అనడం పూర్తి తప్పిదంగా చెబుతున్నారు. ప్రజల గొంతు వినిపించే వారి వాయిస్ నొక్కడమే ఇదంతా అని జగన్ చేస్తున్న కామెంట్లలో కూడా అర్ధం లేదంటారు.
ఒక వేళ అదే నిజమైతే మిథున్ రెడ్డి జగన్ వాయిస్ వినిపించచే రకం గానీ, జనం వాయిస్ వినిపించే వాడు కాడని అంటోంది సిట్ నివేదిక. మొత్తం మూడు వేల కోట్లకు పైగా ఉన్న ఈ లిక్కర్ స్కామ్ లో ఇటు జగన్ కి అటు మిడిల్ మేన్ కి ఆ పై కింది స్థాయిలో ఉన్న లిక్కర్ సిండికేట్ కి జగన్ గొంతుక వినిపించింది మిథున్ రెడ్డే. ఇక్కడ జనం గొంతుక కన్నా జగన్ గొంతుకే ఎక్కువ వినిపించింది. నిజానికి జనం గొంతుక ఏంటి? మనుషులను చంపేసే ఈ కల్తీ మద్యం వద్దని. ఈ మాట ఏ కోశానా కూడా తన చెవికి ఎక్కించుకోలేదు జగన్ రెడ్డి అని అంటారు అధికారులు. ఒక సమయంలో ఒక అధికారికి ఐఏఎస్ హోదా కల్పిస్తానని బూటకు హామీ ఇచ్చి.. తన వైపునకు తిప్పుకోవడంలో ప్రజల గొంతుక ఎక్కడుందో తమకు అర్దం కావడం లేదంటున్నారు కొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే.. జగన్ లిక్కర్ స్కామ్ లీలలు చాలానే. ఈ డబ్బులు కేవలం ఇక్కడే కాదు దేశాంతరం దాటాయని.. వీటిని ఎలాగైనా కక్కిస్తామని అంటారు మంత్రి కొల్లు రవీంద్ర. మరి చూడాలి.. కొల్లు చెప్పినట్టు పెద్ద తిమింగలం ఎప్పుడు బయటకొస్తుందో?.