విజయసాయిరెడ్డి నిజంగా పార్టీ పెడితే?
posted on Nov 24, 2025 9:23AM
.webp)
విజయసాయిరెడ్డి పార్టీ- పార్టీ- పార్టీ.. అంటూ మూడు రకాల పార్టీ రిలేటెడ్ కామెంట్స్ చేశారు. మొదట పార్టీ కామెంట్ విషయానికి వస్తే తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనన్న క్లారిటీ ఇచ్చిన ఆయన తాను ఇప్పుడు కేవలం వ్యవసాయం చేసుకుంటోన్న రైతును మాత్రమేనని స్పష్టం చేశారు. అక్కడితో ఆగకుండా తాను ఏ పార్టీలోనూ చేరడం లేదనీ చెప్పారు. ఇక ముచ్చటగా మూడోది తాను అవసరమైతే సొంతంగా ఒక పార్టీ పెడతానన్నారు
ఆయన ఇవే విషయాలు గతంలోనూ చెప్పారు. అయితే ఇప్పుడు.. అవును ఇప్పుడే ఆయన మళ్లీ ఈ కామెంట్లు ఎందుకు చేశారన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆయన ఇప్పుడు ఈ కామెంట్లు చేయడానికి ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో సోషల్ మీడియాలో ఆయన లక్ష్యంగా పెద్ద ఎత్తున నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. అందుకే తాను ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తనపై ఒత్తిళ్లు చాలానే ఉన్నాయనీ, అయినా సరే తనకు ఏ రాజకీయ పార్టీలో నూ చేరాలన్న తలంపు కూడా లేదనీ మరో సారి కుండబద్దలు కొట్టేశారు
విజయసాయి. గత 20 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక సంబంధ బాంధవ్యాలున్నాయని అంటూనే, జనసేన నుంచి పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి ఉందన్న అర్ధం వచ్చేలా మాట్లాడుతూనే, అదే సమయంలో తాను ఆ పార్టీలో చేరబోవడం లేదన్న క్లారిటీ ఇచ్చారు. నిజానికి విజయసాయిరెడ్డికి బాలకృష్ణతో కావచ్చు, టీడీపీకి సంబంధించిన కుటుంబాలతో కావచ్చు బంధుత్వాలున్నాయి. అనుబంధం ఉంది, కానీ, ఆ రిలేషన్స్ ని క్రాస్ చేసి ఆయన ఎప్పుడూ ఇంత వరకూ రాజకీయాలు చేయలేదు. కాబట్టి జనసేన విషయంలోనూ ఇదే జరుగుతుందనుకోవచ్చ.
ఇక అవసరమైతే పార్టీ పెడతానంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి రిజైన్ చేసేటపుడు కూడా మీడియా చానెల్ పెడతానన్నారు. ఇంత వరకూ ఆ ఊసే లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా సొంతంగా రాజకీయపార్టీ పెట్టడం కూడా జరిగే పని కాదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే గత ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు, అప్పుడు గెలిచి ఉంటే విజయసాయి రెడ్డి సొంత పార్టీ మాటను కొందరైనా నమ్మేందుకు అవకాశం ఉండేది. కానీ నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయిన విజయసాయి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టినా, అది బీహార్ లో సొంత పార్టీ పెట్టి పీకే చూపినంత ప్రభావం కూడా ఏపీ రాజకీయాలలో చేపే అవకాశం ఉండదని అంటున్నారు.