హైదరాబాద్ లో "విశ్వరూపం" సినిమా నిలిపివేత
posted on Jan 25, 2013 2:06PM
.jpg)
కమలహాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమాను రెండు రోజులపాటు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసుల అధికారులకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని థియోటర్ల యజమానులకు పోలీసులు సూచిస్తున్నారు. ముందుగా తెలిపిన వివరాల ప్రకారం తెలుగులో రాష్ట్రవ్యాప్తంగా ఈ చిత్రం ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇంతకుముందు తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రాన్ని ముస్లిం సంఘాల అభ్యంతరాల మేరకు రెండు వారాలపాటు నిషేధం విధించింది. ముస్లింల కోసం ఈ చిత్రం ప్రత్యేకంగా ప్రదర్శించాడు. అయినా కూడా ముస్లింలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో చిత్రం వాయిదా పడింది. కమల్ హాసన్ ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా తెలుగులో అభ్యంతరాలు వ్యక్తం కావడం, ముస్లింల ఈద్ మిలాదున్నబీ పండుగ ఉండడంతో శాంతిభద్రతల దృష్ట్యా రెండురోజులు వాయిదా వేయాలని హోంమంత్రి సూచనలు జారీచేశారు.