విశ్వరూపం బ్యాన్‌: కమల్ కి రజనీకాంత్ సపోర్ట్

 

 

Viswaroopam ban, kamal Viswaroopam, rajinikanth Viswaroopam ban,Viswaroopam ban rajinikanth

 

 

విశ్వరూపం చిత్రం పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించడం పై రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ దేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ అని, ఆయన ఏనాడూ ప్రజల మనోభావాలు కించపరిచేలా సినిమా తీయలేదని అన్నారు. కమల్ హాసన్ వంద కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా విడుదల అపేయడం సరికాదన్నారు. సినిమా విడుదలకు అందరు సహకరించాలని కోరారు.


విశ్వరూపం సినిమాలో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే అవి తొలగించడానికి కమల్ సిద్దంగా ఉన్నారని చెప్పారు.అభ్యంతరాలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలన్నారు. కమల్ హాసన్ తమిళ సినిమాను ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన గొప్ప నటుడు అని అన్నారు.  
ముస్లిం సోదరులకు రజనీకాంత్ మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu