కమల్‌హాసన్ 'విశ్వరూపం' చూపించాడు: స్టోరీ
posted on Jan 25, 2013 1:31PM

సుప్రసిద్ధ నటుడు కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రూపొందించిన ‘విశ్వరూపం’ చిత్ర౦ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆఖరికి ఈరోజు ఆంద్రప్రదేశ్లో విడుదలైంది. ఈ చిత్రం స్టోరీ మీకోసం:
విశ్వనాథ్ (కమల్ హాసన్) న్యూయార్క్ లో ఉండే క్లాసికల్ డాన్స్ టీచర్. అతని భార్య నిరుపమ (పూజా కుమార్). ఐతే భర్త వ్యవహారంపై అనుమానంతో అతనేంటో తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ను పెడుతుంది నిరుపమ. ఆ క్రమంలో విశ్వనాథ్ హిందూ కాదని ఓ ముస్లిం అని తెలుస్తుంది. అంతలోనే ఉగ్రవాద ముఠా విశ్వనాథ్, నిరుపమలను ఎత్తుకెళ్తుంది. ఆ ముఠా నాయకుడు ఒమర్ (రాహుల్ బోస్) విశ్వనాథ్ ను చూసి షాక్ తింటాడు. ఇంతకీ విశ్వనాథ్ ఎవరు? అతనితో ఒమర్ కున్న సంబంధమేంటి అన్నది మిగతా సినిమా.