రాహుల్ గాంధీ నే టార్గెట్ చేశారా..?
posted on May 13, 2017 5:27PM
.jpg)
పాపం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీలే విమర్శలు చేస్తూ ఉండేవారు. గత కొన్ని సంవత్సరాల నుండి రాహుల్ రాజకీయాల్లో ఉన్నా కానీ.. రాహుల్ పై కామెంట్లు మాత్రం కామన్. రాహుల్ వయసు పెరిగింది కానీ.. బుర్ర పెరగలేదని.. రాహుల్ అమూల్ బేబీ అని ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా కామెంట్లే విన్నాం. దీనికి తోడు రాహుల్ చేసే పనులు కూడా ఒక్కోసారి అలానే ఉంటాయి.
అయితే పక్క పార్టీ వాళ్లు కాబట్టి ఎలాగూ విమర్శలు చేయడం కామన్. కానీ ఈ మధ్య ఏకంగా సొంత పార్టీ నేతలే రాహుల్ గాంధీ పై విమర్సలు గుప్పిస్తున్నారు. గతంలో ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్ రాహుల్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి రాహుల్ గాంధీ 'అన్ ఫిట్' అని... రాహుల్ గాంధీ తమ కార్యకర్తల నుంచి ఎందుకు దాక్కుంటున్నారు? అని ప్రశ్నించి పార్టీ నుండి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె బీజేపీలో చేరిందనుకోండి. ఇప్పుడు తాజాగా మరో నేత ఆ ఖాతాలో చేరాడు. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ నేత విశ్వజిత్ రాణే రాహుల్ గాంధీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన విశ్వజిత్ రాణే అనంతరం మార్చి 16న రాజీనామా చేసి బీజేపీలో చేరగా ఆయనకు కేబినెట్ హోదా ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్నారు. అయితే త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని పేర్కొటూ కాంగ్రెస్ పార్టీ ముంబయి హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన ఆయన రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని..2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి అది జరుగుతుందని అన్నారు.
మొత్తానికి అటు ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు.. సొంత పార్టీ నేతలు కూడా రాహుల్ పై కామెంట్లు విసురుతుండటంతో ఏం చేయలేని అయోమయంలో పడిపోయారు. మరి ఇలాంటి మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పెజేప్పుతారా.. లేదా.. అన్నది సందేహం..