రేపు ఓ సీక్రెట్ బయటపెడుతున్నా..!
posted on May 13, 2017 4:18PM

ఇప్పటికే ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసి అందరికీ షాకిచ్చిన కపిల్ మిశ్రా ఇప్పుడు మరో షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కపిల్ మిశ్రా ప్రస్తుతం పార్టీ నుండి బహిష్కరణకు గురై నిరహార దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నేను ఒంటరినని భావిస్తున్నాను. అందుకే రాజ్ ఘాట్‌కు వచ్చాను. రేపు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళతా అని చెప్పారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. తాను రేపు మరో విషయాన్ని బయటపెడతా అని.. దాని తర్వాత ఢిల్లీ ప్రజల ప్రకంపనలు చూస్తారు.. ముఖ్యంగా ఎవరు ఆప్‌ను నమ్మారో వారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రేపు కపిల్ మిశ్రా ఏం బయటపెట్టనున్నారో అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాపూ ఘాట్‌కు వెళ్లిన ఆయనను ఆరోగ్యం క్షీణించిందని, ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సలహా ఇచ్చారు. మరి కపిల్ మిశ్రా వ్యాఖ్యలపై ఆప్ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం..