ఇందిరాగాంధీ పై ప్రణబ్ కీలక వ్యాఖ్యలు...

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇందిరాగాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్, ప్రసంగిస్తూ నేటికీ ఇండియాలో అత్యధికుల ఆదరణను పొందిన ప్రధాని ఇందియా గాంధీయేనని... 20వ శతాబ్దపు నేతల్లో ప్రపంచం గుర్తుంచుకున్న అతి కొద్ది మందిలో ఇందిర కూడా ఉన్నారని, ఆమె మన మధ్య లేకున్నా, ఆమె పాలన ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ఆమె పాలనా దక్షత అమోఘమని, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపే వేగం తననెంతో ఆకర్షించేదని చెప్పుకొచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu