విజయ్ మాల్యాకు ఛాన్స్ ఇవ్వండి.. మీడియా హడావుడి ఎక్కువైంది
posted on Mar 21, 2016 5:05PM

బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యాపై చాలా మంది చాలానే ఆరోపణలు చేశారు. అయితే అందరూ ఆరోపణలు చేస్తూన్న నేపథ్యంలో బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా మాత్రం విజయ్ మాల్యాకు తన మద్దతును ప్రకటించారు. విజయ్ మాల్యా వ్యవహారంపై స్పందించిన ఆమె.. విజయ్ మాల్యాపై మీడియాయే విచారణ జరపటం వల్ల ప్రయోజనం లేదని.. రుణ డిఫాల్ట్ సమస్యను బ్యాంకులతో సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మాల్యా స్వయంగా చెప్పినందున, ఆయనకు సముచిత అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మీడియా హడావుడి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.. ఈరోజుల్లో మీడియానే ప్రతిఒక్కరినీ విచారణ చేస్తుంది.. దీనివల్ల అసలు ప్రక్రియ కుంటుపడుతోంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. మాల్యా కచ్చితంగా భారత్ తిరిగి వస్తారని మజుందార్ షా ధీమా వ్యక్తం చేశారు.