భారీగా పెరగనున్న తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతభత్యాలు

 

తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జీతభత్యాలు భారీగానే పెంచనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపునకు శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ సిఫారసు చేయగా దీనిపై చర్చించిన అనంతరం.. సభ్యుల జీత భత్యాలను రూ.1.25 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచే విధంగా కమిటీ సిఫారసు చేసింది. ఇంకా అనేక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

* ప్రస్తుతం సభ్యులకు ఇస్తున్న వెహికల్ లోన్‌ను రూ. 15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుట..
* మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛను రూ.50 వేల నుంచి రూ.65 వేలకు పెంచుట..
* ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మరణిస్తే, వారి మరణాంతరం వారి భార్యలకు కూడా ఇదే సౌకర్యాలను కల్పించుట..
* రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu