భారత ఉపరాష్ట్రపతి రాజీనామా

 

భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు.  ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీకి ధన్యవాదలు తెలిపారు.

కాగా 2022 ఆగస్టు11న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకు ముందుకు 1990-91 మధ్య కేంద్రమంత్రిగా 2019-22 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సేవలందించారు . కిసాన్ పుత్రగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. జనతాదళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడుగా కూడా పనిచేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu