విశాలాంధ్ర మహాసభలో ఉద్రిక్తత
posted on Dec 29, 2011 1:03PM
హైదరాబా
ద్: విశాలాంధ్ర మహాసభను తెలంగాణవాదులు మరోసారి అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరుగుతున్న మహాసభలో సభ్యులు లక్ష్మణరావు హైదరాబాద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ జర్నలిస్టులు నిరసనకు దిగారు. దీనిపై సదస్సు ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. హైదరాబాదులో ఉండాలంటే కేసీఆర్ పర్మిమిషన్ కావాలా అంటూ నిలదీశారు. దీంతో పరస్పరం వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ విషయం తెల్సుకున్న తెలంగాణవాదులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పక్షాలను శాంతింపజేశారు. అనంతరం ఆందోళన చేస్తున్నవారిని అక్కడి నుంచి పంపివేశారు.
అనంతరం సంస్థ సభ్యుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ 1956 నుంచి తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విభజనవాదులు వాదిస్తున్నారు. అది అబద్ధమని విశాలాంధ్ర సభ నిరూపించింది.ఆ తర్వాత మీ భాష వేరు.. మా భాష వేరు.. అన్నారు. అదీ అబద్ధమని విశాలాంధ్ర మహాసభ నిరూపిస్తుంది. ఇలా అనేక విషయాలను మసిబూసి మారేడుకాయ చూపిస్తున్నారనీ, అవన్నీ అసత్యాలని నిరూపిస్తున్న తమ గొంతు నొక్కేందుకు విభజనవాదులు ప్రయత్నిస్తున్నారన్నారు. ధైర్యం ఉంటే తమ వాదనలో నిజాలు లేవని చెప్పేందుకు తగిన ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు