అప్పుడు మేం అలా చేయలేదే.. వెంకయ్య

రాజ్యసభలో నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఆందోళనపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అమిత్ షా పై కేసులు పెట్టి వేధించారు.. కానీ అప్పుడు మేము పార్లమెంట్ ను అడ్డుకోలేదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు తీసుకున్న నిర్ణయానికి.. ప్రభుత్వం పై కోపాన్ని చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు. కాగా రాజ్యసభలో ఆందోళనలు చేసిన 23 మంది కాంగ్రెస్, వామపక్షాల సభ్యులను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సస్పెండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu