సుప్రీంకోర్టుపై గ్రేనేడ్లతో దాడి....
posted on Jun 28, 2017 12:03PM
.jpg)
ఏకంగా సుప్రీంకోర్టుపైనే గ్రేనేడ్లతో దాడి చేసిన ఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... వెనిజులా సుప్రీంకోర్టుపై హెలికాప్టర్‌తో దాడి చేశారు. అయితే దాడి చేసింది ఓ ఆర్మీ ఆఫీసరే అని తెలుస్తోంది. ఓ ఆర్మీ ఆఫీసర్ రాజధాని కారకస్‌లో ఉన్న సుప్రీంకోర్టుపై హెలికాప్టర్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆ ఆర్మీ ఆఫీసర్ హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అంతేకాదు ఆ దాడి చేసింది తానే అని ఆర్మీ ఆఫీసర్ ఆస్కార్ పిరేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ప్రకటన చేశాడు. ఇంక దీనిపై స్పందించిన దేశాధ్యక్షుడు నికోలస్ మాడురో దీనిని ఉగ్రదాడిగా చిత్రీకరించారు.