నామినేషన్‌ దాఖలు చేసిన మీరా కుమార్‌...

 

వచ్చే నెల రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా... విపక్షాల ఉమ్మడి  రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఈరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యదర్శికి.. మీరా కుమార్‌ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మల్లికార్జున ఖర్గే, శరద్‌ పవార్‌, సీతారాం ఏచూరి, కనిమొళి తదితరులతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నేతలు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని 17 విపక్ష పార్టీలు మీరాకుమార్‌కు మద్దతు పలుకుతున్నాయి.