బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా? : వర్ల రామయ్య

 

సొంత బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా అని  జగన్‌ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. సింగయ్య చావుకు తన కారుకు సంబంధం లేదని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? సింగయ్యను వైసీపీ కార్యకర్తలే టైర్ క్రింద నుండి లాగి పక్కన పడేయలేదని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? ఆయన ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ ని  నిలదీశారు.  చిన్న నాటి నుండి జగన్ రెడ్డి వ్యక్తిత్వం నేర ప్రవృత్తితో మిళితం అయ్యిందని.  విద్యార్థి దశలోనే ప్రశ్నాపత్రాలు దొంగిలించారన్న ఆరోపణలు తనపై ఉన్నాయిని రామయ్య అన్నారు. 

ఆ ఆరోపణలపై ఇప్పటికీ జగన్ రెడ్డి నుండి సమాధానం లేదు. పార్లమెంట్ కు రాజీనామా చేయనన్నాడని.. లాలించి పెంచి ప్రేమించిన బాబాయిని లాగి చెంప పగలగొట్టిన మనస్తత్వం జగన్‌దని ఆయన ఆరొపించారు. హైదరాబాద్ కు వద్దని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను వారించినా బెంగళూరులో ఉండకుండా పదే పదే హైదరాబాద్ కు వచ్చి తండ్రికి తలనొప్పి కలిగించిన కొడుకు జగన్ రెడ్డి.  తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్ ది. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్ కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని ఆయన పేర్కొన్నారు. 

సొంత తల్లి తన ఇంట్లో లేకపోవడానికి జగన్ రెడ్డి వీపరీత మనస్తత్వమే కారణం. సోంత చెల్లి తనకు దూరం అవ్వడానికి జగన్ వీపరీత మనస్తత్వమే కారణం. మాజీ సీఎంకు ధనాశకు వారు ఎక్కడో ఉంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. జగన్ రెడ్డి బాబాయి కూతరు సునీత నాడు న్యాయం కోసం ఢిల్లీ నడివీధుల్లో ఎండలో నడుస్తుంటే నాకే బాధేసింది జగన్ రెడ్డికి మాత్రం మనసు కరగలేదని ఆయన అన్నారు. అధికార దాహం కోసం జగన్ రెడ్డి ఏదైనా చేయగలరు. స్టేరాయిడ్స్ తీసుకునే అథ్లెట్ కు.. అరాచకంతో అధికారంలోకి రావాలనుకునే జగన్ రెడ్డికి ఎటువంటి తేడాలేదు. తన ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏవర్గానికి మేలు చేశాడో చెప్పగలడాని వర్ల రామయ్య నిలదీశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu