తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దాదాపు నెలన్నర నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా పట్టిన సమయం తెలిసిందే. వసతి గదుల కోసం కూడా భక్తులకు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.  విద్యాసంస్థలు తెరుచుకోవడం, పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  గురువారం (జూన్ 26) శ్రీవారిని 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,765 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల వచ్చింది. ఇక శుక్రవారం (జూన్ 27) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లునిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.  టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమ యం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలుచేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది.