డోసుల రేసులో పెరుగుతున్న పోటీలు

కోవిద్ 19 వైరస్ తో అతి ఎక్కువగా ప్రభావితమైన అగ్రదేశాలు వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసే రేసులో పోటీలు పడుతున్నాయి. వ్యాక్సిన్ తయారి కోసం ప్రపంచంలోని అనేక దేశాల్లోని 150కి పైగా సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఆక్స్ ఫర్డ్, రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుని మార్కెట్ లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందే కరోనాతో తీవ్రంగా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం చవిచూసిన అగ్రరాజ్యాలు తమ ప్రజలకు కావల్సిన స్థాయిలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి.  ఫైజర్‌, బియోఎన్‌టెక్‌ఎస్‌ఈ సంయుక్తంగా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ పాలకవర్గం ఒప్పందం చేసుకుంది. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తే డిసెంబర్‌లోగా అందించే 10 కోట్ల డోసులకు 200 కోట్ల డాలర్లు చెల్లించడానికి అమెరికా సిద్దంగా ఉంది. ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసి సురక్షితమే అని స్పష్టమైన తర్వాత మరో 50కోట్ల డోసులు కొనడానికి ట్రంప్ రెడీగా ఉన్నాడు. వ్యాక్సిన్ ఏ దేశం అందుబాటులోకి తీసుకువచ్చినా ముందుగా తమ ప్రజలకు దానిని ఇచ్చేందుకు ట్రంప్ భారీగా కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే బ్రిటన్‌ తొమ్మిది కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకుంది.

కొత్తగా నిమిషానికి 43 మంది ..
ప్రపంచంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయిన దేశం అమెరికానే. ఇక్కడ నిమిషానికి 43 మంది కొత్తగా కోవిద్ 19 వైరస్ బారిన పడుతున్నారు.  దేశవ్యాప్తంగా కరోనా కేసులు 40 లక్షలు దాటిపోయాయి. లక్షా 47,342 మంది మరణించారు. దాదాపు 20లక్షల మంది రికవరీ అయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu