ఈ నెల 6న ఢిల్లీలో ధర్నా.. టీపీసీసీ పిలుపు

 

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నాట్లు టీపీసీసీ తెలిపింది. ఇందుకోసం  ఈనెల 4న ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలు బయల్దేరుతుందని పేర్కొంది. ఢిల్లీకి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు   తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని సూచించింది. ఈ నెల 5న పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం  7న రాష్ట్రపతికి వినతి సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. 

ప్రతి జిల్లా డీసీసీల నుంచి 25 మంది పేర్లను లిస్ట్ చేసి టీపీసీసీకి పంపించాలి. రైల్ తిరిగి 7వ తేదీ సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది. డీసీసీ అధ్యక్షులు పేర్లను సకాలంలో పంపించి సహకరించి ధర్నా పెద్దఎత్తున విజయవంతం చేయాలని పేర్కొన్నారు.  జిల్లా నుంచి వచ్చే 25 మందిని సకాలంలో రైల్వే స్టేషన్‌కు చేర్చాలి. ఢిల్లీకి వచ్చే వారికి అక్కడ వసతి, రవాణా, భోజన సదుపాయాలను పార్టీ ఏర్పాటు చేసిందని పార్టీ అధిష్టానం పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu