తెలంగాణను అడ్డుకోవడానికి కెవిపి ఇంట్లో భేటి
posted on Jul 1, 2013 10:54AM

ఆంద్రప్రదేశ్ కి దిగ్విజయ్ సింగ్ కి రావడంతో సమైక్యాంధ్ర వివాదం మళ్ళీ వేడెక్కింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మొగ్గు చూపుతోందన్న వార్తలు రావడంతో, తెలంగాణ ను ఇప్పుడు అడ్డుకోగలిగితే రాష్ట్రాన్ని విభజించడం ఇంకెవరి తరం కాదన్న దృఢమైన అభిప్రాయంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు భేటీ అయ్యారు.
ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి.. రాష్ట్ర విభజన సమర్ధనీయం కాదని వినతి పత్రం ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ వినతి పత్రం ఎలా ఉండాలన్న విషయమై వారు వివరంగా చర్చించుకున్నారు. జల వివాదాలు, ప్రాంతాల వారీగా అభివృద్ధి, నిధుల మంజూరు లాంటి అంశాలనూ వారు తమ నివేదికలో పొందుపరచారని సమాచారం.