దిగ్విజయ్ కు సమైక్య సెగ
posted on Jul 1, 2013 10:31AM

రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా నియమితులైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ కి సమైక్యాంధ్ర సెగ తగిలింది. విశాఖలో జరిగిన క్షత్రియుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన దిగ్విజయ్ ని కేంద్రమంత్రి పురందేశ్వరి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, బాలరాజు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి తదితరులు కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించవద్దు. కలిసి ఉంటేనే అభివృద్ది సాధ్యం అని మంత్రి సాకె శైలజానాథ్ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా కేవలం ఒత్తిడి తెచ్చేవాళ్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదని స్పష్టం చేశారు. అయితే ఏ విధమయిన సంకేతాలు ఉన్నా తాను చెబుతానని దిగ్విజయ్ తెలిపారు.