ఇద్దరు వృద్ద మహిళల దారుణ హత్య

గుంటూరు  జిల్లా తెనాలి ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.   తెనాలిలోని పరిమిడొంకలో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ అనే వృద్ధురాళ్ళను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం(జూన్ 19) దారుణంగా హత్య చేశారు.   వీరిరువురూ అదే రోజు ఉదయం బంధువుల ఇంట్లో వివాహానికి హాజరై మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు.  ఆ తరువాత హత్యకు గురయ్యారు.   స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  వృద్ధుల ఒంటిమీద బంగారం లేకపోవడం, ఘటనా స్థలంలో పెనగులాట జరిగిన ఆనవాళ్ళు ఉండటం, వారి తలపై బలమైన గాయాలు ఉండటంతో.. బంగారం, నగదు కోసమే ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు.  

స్థానికుల కథనం ప్రకారం గురువారం (జూన్ 19)మధ్యాహ్న సమయంలో   ముగ్గురు వ్యక్తులు  వృద్థురాళ్ల ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ ఉన్నట్లు చెబుతున్నారు. బంగారం, నగదు కోసం వారే ఈ హత్యలు చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu