శారదా పీఠం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు టీటీడీ నిర్ణయం

తిరుమలలో  శారదాపీఠం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. తిరుమలలో అక్రమ నిర్మాణాల తొలగింపునకు తొలుత నోటీసులు జారీ చేసి ఆ తరువాత కూల్చివేయాలన్న నిర్ణయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం టీటీడీ భూముల్లో శారదాపీఠం అక్రమనిర్మాణాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.

జగన్ అండతో గత కొన్నేళ్లుగా తిరుమలలో శారదా పీఠం యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలను చేపట్టింది. 20 వేల  చదరపు అడుగులలో ఈ నిర్మాణాలు ఉణ్నాయి. తిరుమలలో రోడ్డును కూడా ఆక్రమించి శారదా పీఠం మఠం నిర్వాహకులు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. అలాగే చెరువులను సైతం ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  టీటీడీ సమాచారం మేరకు 20 వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టింది. గత ఏడాది డిసెంబర్‌లో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్న పాలకమండలి 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఈ అక్రమ నిర్మాణాలను క్రమబ ద్ధీకరించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీసీ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు అందుకోవడంతో జగన్ హయాంలో శారదాపీఠం తిరుమల కొండపై చేపట్టిన అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో సమగ్ర నివేదికను సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన  దేవాదాయ శాఖ  గత పాలకమండలి ఇచ్చిన ధృవీకరణను రద్దు చేసింది. అలాగే శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని  ఆదేశించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu