ఆ మూడు రోజులూ సర్వదర్శనాలు రద్దు.. తిరుమల తిరుపతి దేవస్థానం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల2వ తేదీ వరకూ సామాన్య భక్తులకు సర్వదర్శనాలను నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గోవింద మాల ధరించిన భక్తులకు కూడా ఆ మూడు రోజులూ  సర్వదర్శనాలకు అవకాశం లేదని పేర్కొంది. జనవరి 3 నుంచి మళ్లీ యధాప్రకారం సర్వదర్శనాలకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.  ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది.

లక్కీ డిప్‌ టికెట్‌ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని టీటీడీ సూచించింది. ఈ మేరకు మీడియా, సోషల్ మీడియాలో టీటీడీవిస్తృత స్థాయిలో  ప్రకటనలు జారీ చేసింది.  అయితే టీటీడీ నిర్ణయం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది టీటీడీ ఏకపక్షంగా సర్వదర్శనాలు రద్దు చేసి.. వైకుంఠ ఏకాదశి రోజు సామాన్యులకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేస్తున్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu