శివాజీదే తప్పు.. నాగబాబు

మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్ అటు సోషల్ మీడియాలో పెను చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. మరో వైపు శివాజీ వ్యాఖ్యలపై నటి,  యాంకర్ అనసూయ,  సహా పలువురు సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివాజీ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ వ్యంగ్యంగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ అంశంపై సోషల్ మీడియాలో  తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఒక వర్గం శివాజీ మాటల్లోని ఉద్దేశాన్ని సమర్థిస్తే, మరో వర్గం మహిళలపై మోరల్ పోలీసింగ్‌ను తీవ్రంగా ఖండిస్తోంది.శివాజీ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నటుడు, జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు.  శివాజీ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదన్నారు.  మహిళలు ఎలా ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి అనేది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదన్న నాగబాబు ఇది మోరల్ పొలీసింగ్ కిందకే వస్తుందన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu