ఇండియాపై ట్రంప్ మరో దెబ్బ!
posted on Sep 26, 2025 3:38PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై టారిఫ్ వార్ ను మరింత ఉధృతం చేశారు. తాజాగా భారత్ నుంచి దిగుమతి అయ్యే ఔషధాలపై పై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
గత ఏడాది అమెరికా ఇండియా నుంచి దాదాపు 233 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను దిగుమతి చేసుకుంది కాగా అమెరికాలోనే ఔషధాలను తయారు చేసే కంపెనీలకు ఈ టారిఫ్ నుంచి మినహా యింపు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం ఇండియన్ ఫార్మా కంపెనీలపై తీవర ప్రభావం చూపనుంది. భారత్ నుంచి అమెరికాకు అధికంగా జెనరిక్ మెడిసెన్స్ ఎగుమతి అవుతాయి. చాలా వరకూ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు తమ మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతం అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారానే వస్తున్నది. దీంతో ఈ కంపెనీలపై ట్రంప్ నిర్ణయం పెను ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.