టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఆరు నెలల జైలు

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది. ఓ కేసులో ఎమ్మెల్యేకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజాప్రతి నిధుల కోర్టు జైలు శిక్ష విధించింది. 6 నెలల జైలు శిక్షతో పాటు వేయి రూపాయలు జరిమానా విధించింది. 2013లో వ్యక్తిపై దాడిచేసి గాయపర్చారన్న కేసులో అభియోగం రుజువైనట్లు కోర్టు వెల్లడించింది. ఈ కేసులో దానం నాగేందర్‌ను దోషిగా తేల్చింది. అయితే  తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు నెల రోజుల పాటు కోర్టు అవకాశం ఇచ్చింది.