కేసీఆర్ పై విరుచుకుపడిన జగన్ పార్టీ నేతలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కెసిఆర్ దీక్ష పేరుతో మరోసారి నాటకానికి తెరదీశారని గోనె ప్రకాశరావు ధ్వజమెత్తారు. సెంటిమెంటును అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం యువత, విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆఢుకోవద్దని హితవు పలికారు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు ఆసుపత్రుల్లో కెసిఆర్ చేయించుకున్న ట్రీట్‌మెంట్ వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. వాటిని మూడు రోజుల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానన్నారు. టిఆర్ఎస్ బలోపేతమైనంత మాత్రాన తెలంగాణ రాదని జాతీయ పార్టీలతోనే అది సాధ్యమన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu