రాత్రికే తుఫాను తీరం దాటనుందా?
posted on Dec 29, 2011 4:04PM
హైదరా
బాద్: థానే తుపాను గురువారం రాత్రే తీరం దాటవచ్చునని తెలుస్తున్నది. చెన్నైకి ఆగ్నేయంగా 200 కిలీమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను చెన్నై-నాగపట్నం మధ్య తీరం దాటే సమయంలో సముద్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను తొలుత ఆంధ్రప్రదేశ్‌కు ముంచుకువస్తున్నదని భావించారు. అయితే గత 12 గంటలలో తుపాను దిశ స్పష్టంగా మారుతూపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పినట్టేనని అధికారులు భావిస్తున్నారు. అయితే అప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నానికే చెన్నైలో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. తీరం దాటే సమయంలో కోస్తా తీరం పొడవునా చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేసారు. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలలో కూడా మత్స్యకారులు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.