తుఫాను పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది రఘువీరా
posted on Dec 29, 2011 3:45PM
హై
దరాబాద్: తుఫానును ఆపే శక్తి ఎవ్వరికీ లేదని మంత్రి రఘువీరా రెడ్డి బుధవారం అన్నారు. అయితే తుఫాను పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను దృష్ట్యా భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చెప్పే వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దన్నారు. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసేందుకు ఎండిఆర్ఎం ఫోర్సును పంపించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాల్లో పంట కోతకు ఉందని, రైతులు దానిని రక్షించుకునే ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా బంగాళాఖాతంలో థేన్ తుఫాను కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం తుఫాన్ తీరం దాటే అవకాశముంది.