పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి
posted on Jul 25, 2025 10:07AM

రాజస్థాన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ దుర్ఘటన ఝలావర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం (జులై 25) ఉదయం ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు అంతలోనే మృత్యువాత పడటంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల దుఖానికి అంతులేకుండా పోయింది.
ఝలావర్ లోని ప్రాథమిక పాఠశాల భవనం పై కప్పు ఈ ఉదయం పది గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు గాయపడగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది విద్యార్థులు చిక్కుకున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానికులు, పోలీసులు, అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.