హోమం టికెట్లతో తిరుమల దేవుడి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆ దర్శనం సులువుగా అయ్యేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో వెసులుబాటు కూడా కల్పించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తిరుమల దేవుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. కాగా భక్తులు ఎక్కువగా శ్రీవారి దర్శనం కోసం  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లపైనే  ఆధారపడతారు. ఆ టికెట్లు దొరకకపోతే తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటుంటారు. అన్ని కుదిరి తిరుమల పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్న భక్తులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు దొరకక ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే.. మళ్లీ ఎప్పుడు కుదురుతుంది? సెలవలు దొరుకుతాయా అన్న సందిగ్ధంలో  ఉంటారు. భక్తులకు ఈ బాధ తప్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం హోమం టికెట్లతో కూడా శ్రీవారి దర్శనం  చేసుకోవచ్చన్న వెసులుబాటును కల్పించింది.

 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కు ప్రత్యామ్నాయంగా ఈ నెల   25న  శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం' పేరిట ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టికెట్ ధర ఒక్క 1600 రూపాయలు. ఒక టికెట్ పై   ఇద్దరు హాజరు కావడచ్చు.  ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు, దర్శనానికి ముందే అలిపిరిలోని సప్తగృహ వద్ద రిపోర్ట్ చేయాలి. అనంతరం అక్కడ నిర్వహించే హోమం పూర్తి అయిన తరువాత.. అదే రోజు మధ్యాహ్నం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ ద్వారా స్వామి వారి దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu