ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 45 నిముషాల పాటు త్రిశంకు స్వర్గంలో ప్రయాణీకుల ప్రాణాలు

ఇండిగో విమానంలో ఏర్పడన సాంకేతిక లోపం కారణంగా ప్రయాణీకులు దాదాపు 45 నిముషాల సేపు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయాందోళనలతో నరకం అనుభవించారు. తిరుపతి నుంచ హైదరాబాద్ వెడుతున్న విమానం టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో ఆ విమానం దాదాపు 45 నిముషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. అంత సేపూ విమానంలోని ప్రయాణీకులు ప్రాణాలు గిప్పిట పట్టుకుని నరకం అనుభవించారు.  అయితే ఎట్టకేలకు తిరుపతి విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu