తిరుమల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం...

 

తిరుమల కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. ఈ నెల 14న తిరుమలలో ఓ చిన్నారి కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అప్పటినుండి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ లో నిందితులను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఫలితం మాత్రం శూన్యం. కానీ ఇప్పుడు తాజాగా తమిళనాడులోని నామకల్ లో బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతులు, బాలుడితో పాటు లొంగిపోయారు. దీంతో బాలుడిని తీసుకుని పోలీసులు, తిరుపతి బయల్దేరారు. కాసేపట్లో బాలుడు తిరుపతి చేరుకోనున్నాడని, బాలుడు క్షేమంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. తమకు పిల్లలు లేకపోవడంతోనే బాలుడ్ని కిడ్నాప్ చేశామని ఆ దంపతులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu