ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన పాక్...

 

ఉగ్రవాదానికి పాకిస్థాన్ సహకరిస్తుందంటూ భారత్ సహా పలు దేశాలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అగ్రరాజ్యాలు పాక్ కు ఉగ్రవాదం విషయంలో హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పలుమార్లు పాక్ ను హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఈనేపథ్యంలోనే  పాకిస్థాన్‌ దిగొచ్చినట్టు కనిపిస్తోంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ప్రోత్సహించరాదని, అలా చేస్తే అంతర్జాతీయ సమాజం తరుపున తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో.. తెహ్రిక్‌ ఈ ఆజాదీ జమ్ము అండ్‌ కశ్మీర్‌ సంస్థపై నిషేధం విధించింది. ఈ సంస్థే ప్రస్తుతం జమాత్‌ ఉద్‌ దవాగా కూడా కొనసాగుతుంది. 2008లో ముంబయిలో పేలుళ్లకు ఈ ఉగ్రవాద సంస్థే మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu