సరైన కెరీర్ ను ఎంచుకోవడం ఎలా?

 

ప్రతి మనిషి జీవితంలో ఏదైనా ముఖ్యమైన మొదటి దశ ఉందంటే అది కెరీర్ కు సంబంధించిన విషయమే అయ్యుంటుంది.కెరీర్ విషయంలో తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే  ఉద్యోగం,  ఆనందం,  ఆర్థిక స్థితి, వ్యక్తిగత అభివృద్ది వంటి విషయాలు ఆధారపడి ఉంటాయి. చాలా మంది అవగాహన లేకుండా సమాజంలో దేనికి ఆదరణ ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని దాన్నే తమ కెరీర్ గా ఎంచుకుంటారు. ఇది ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ.. అన్ని వేళలా ఇది పనిచేయదు.  సరైన కెరీర్ ను ఎంచుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే..

ఆసక్తులు, అభిరుచులు..

మీరు ఏ విషయాలలో ఆసక్తి చూపిస్తారు? (ఉదా: సైన్స్, ఆర్ట్స్, బిజినెస్, టెక్నాలజీ, క్రియేటివ్ ఫీల్డ్స్, సర్వీస్?)

చిన్నప్పటి నుండి మీరు ఎక్కువగా ఆసక్తి చూపిన విషయాలు ఏవి? ఏ పని చేసేటప్పుడు మీరు టైమ్ గమనించకుండా మునిగిపోతారు?

ఉదాహరణ: మీకు problems solve చేయడం ఇష్టం అయితే — సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్, లా వంటివి మంచి ఎంపికలు.

 మీ సామర్థ్యాలు, బలాలు..

మీరు ఏ విషయాన్ని బాగా  చేయగలరు? (ఉదా: గణితం, భాషలు, కమ్యూనికేషన్, ఆర్ట్, లీడర్‌షిప్, డిజైన్)

ఇతరులు మీలో ఏ బలాలను గుర్తిస్తారు?

దీన్ని అర్థం చేసుకోవడానికి Aptitude Tests లేదా Career Assessment Tests (ఉదా: MBTI, Holland Code) చేయవచ్చు.

 మార్కెట్ లో అవకాశాలు..

ఎంచుకోవాలి అనుకున్న రంగంలో ఫ్యూచర్ డిమాండ్ ఉందా? ఆ ఫీల్డ్ లో గ్రోత్, జాబ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? కొత్తగా పెరుగుతున్న రంగాలు ఏమిటి? (ఉదా: AI, డేటా సైన్స్, సస్టైనబిలిటీ, డిజిటల్ మార్కెటింగ్)

జీతం,  జీవన ప్రమాణాలు..

మీరు ఎంచుకునే కెరీర్ మీ ఆర్థిక అవసరాలను నెరవేర్చగలదా? మీరు కోరుకునే జీవన విధానానికి అనువుగా ఉందా? ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

 మెంటార్లు,  ప్రొఫెషనల్స్..

మీరు ఇష్టపడే రంగంలో ఇప్పటికే ఉన్నవారి అనుభవాలను తెలుసుకోవాలి.   వారు ఎదుర్కొనే సవాళ్లు, సంతృప్తి, అవకాశాలు తెలుసుకోవాలి.  సవాళ్లను అధిగమించడానికి కావలసిన నైపుణ్యాలు, సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి.

ప్రాక్టికల్ ఎక్స్పీరిన్స్..

ఇంటర్న్షిప్‌లు, వర్క్‌షాప్‌లు, ప్రాజెక్ట్‌లు, వాలంటీర్ వర్క్ ద్వారా ఫీల్డ్ ను దగ్గరగా చూడడం వల్ల చాలా మంచి అనుభవం లభిస్తుంది.

భవిష్యత్తు..

ఈ కెరీర్ లో మీరు 10-20 ఏళ్ళ తరువాత మీరు ఎక్కడ  ఉంటారు, ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలని అనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచించాలి.  అది మీ వ్యక్తిత్వం, విలువలకు సరిపోతుందా?

చివరగా..

కెరీర్ ఎంపికలో ఎప్పుడూ ఒకే సరైన దారి ఉండదు. మీ అభిరుచి, సామర్థ్యం, మార్కెట్ డిమాండ్, జీవిత లక్ష్యాల కలయికతో సరైన దారి ఏర్పడుతుంది.
ముఖ్యంగా.. శాంతిగా ఆలోచించాలి.  రీసెర్చ్ చేయాలి. అవసరమైతే కెరీర్ కౌన్సెలింగ్  సహాయం తీసుకోవాలి. ఇది చాలా మంచి పునాదికి దారి తీస్తుంది.

                                      *రూపశ్రీ.