జ‌ర్న‌లిస్టుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

 

జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జ‌ర్న‌లిస్ట్‌లకు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వాల‌ని అధికారులకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, కొలుసు పార్ధ సార‌ధి, నారాయ‌ణ‌ల‌తో ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థలాలపై విధివిధానలను రూపోందించనుంది. వాటిని సమర్పంచనుంది. ఆ తర్వాత ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

రెవెన్యూ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వారసత్వ భూములకు సచివాలయంలోనే సక్సెషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షల లోపు విలువైన భూములకు రూ.100 రుసుముతో సర్టిఫికెట్లు పొందవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఆగస్టు 2లోగా, రెవెన్యూ సమస్యలు అక్టోబర్ 2 నాటికి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.