థాంక్యూ చంద్రబాబు సర్!

బెజవాడను వరద ముంచెత్తిన సమయంలో బాధితులను అండగా నిలిచేందుకు ఏపీ ముఖ్యమంత్రి అనితర సాధ్యమైన చొరవ చూపారని, విజయవాడ నగరం సాధారణ స్థితికి తీసుకువచ్చేందును తీవ్రంగా కష్టపడ్డారని పేర్కొంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు కృతజ్ణతలు తెలిపారు. వీరంతా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నివాసంలో సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అదే విధంగా దసరా సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించబోయే నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu